మంగళవారం 26 మే 2020
National - May 15, 2020 , 15:27:16

ఎంజాయ్‌ కోసమైతే గోవా రావొద్దు

ఎంజాయ్‌ కోసమైతే గోవా రావొద్దు

పనాజి: సరదాగా గడపడానికే అయితే గోవా రావద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ విజ్ఞప్తి చేశారు. అలా వచ్చినవారిని తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారైంటైన్‌కు తరలిస్తామని వెల్లడించారు. న్యూఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తున్న ప్రత్యేక రైలులో 720 మంది మడ్‌గావ్‌ వరకు టికెట్లు బుక్‌చేసుకున్నారని, వారిలో గోవాకు చెందినవారు ఒక్కరుకూడా లేరని మేం గ్రహించామని చెప్పారు. ఢిల్లీలో ఈ రోజు బయల్దేరిన ప్రత్యేక రైలు రేపు తిరువనంతపురం చేరుకోనుంది. మాడ్‌గావ్‌లో రైలు ఆపకూడదని తాము ఇప్పటికే రైల్వేశాఖను కోరామని తెలిపారు. ఇలా వచ్చేవారిలో గోవా పౌరులతోపాటు, రాష్ర్టానికి చెందనివారిని కూడా హోం క్వారంటైన్‌లో ఉంచుతామని ఆయన వెల్లడించారు. సుమారు నెల రోజుల తర్వాత మాడ్‌గావ్‌లో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది.


logo