మంగళవారం 07 జూలై 2020
National - Jul 05, 2020 , 02:45:36

తల్లి ప్రాణం కోసం తల్లడిల్లాడు!

తల్లి ప్రాణం కోసం తల్లడిల్లాడు!

హర్దోయీ: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని దవాఖానకు తీసుకెళ్లాడు. తలుపు మూసి ఉంది. అక్కడ ఎవరూ లేరు. తల్లిని నేలపై పడుకోబెట్టాడు. ఎవరైనా ఉన్నారా.. అని పలుమార్లు గట్టిగా పిలిచాడు. స్పందన లేదు. ఏమీ చేయలేని నిస్సహాయత. అటూ.. ఇటూ తిరిగాడు. దవాఖాన కిటికీ అద్దాలు పగులగొట్టాడు. అది చూసి ఎవరైనా వస్తారేమోనన్న ఆశ అతనిది. ఎవరూ రాలేదు. వైద్యం అందక కండ్లముందే తల్లి చనిపోయింది. హృదయాన్ని ద్రవింపజేసే ఈ ఘటన యూపీలోని హర్దోయిలో జరిగింది. తల్లి మృతదేహం పక్కన కూర్చొని ఆ కుమారుడు గుండలవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.


logo