సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 13:53:01

సెప్టెంబ‌ర్ 15 వర‌‌కు రిక్రూట్మెంట్ చేయం.. మ‌రాఠా కోటాపై సుప్రీం విచార‌ణ వాయిదా

సెప్టెంబ‌ర్ 15 వర‌‌కు రిక్రూట్మెంట్ చేయం.. మ‌రాఠా కోటాపై సుప్రీం విచార‌ణ వాయిదా

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో రాష్ట్రంలో సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు ఎటువంటి రిక్రూట్మెంట్ చేప‌ట్ట‌మ‌ని ఇవాళ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు తెలియ‌జేసింది. మ‌రాఠా రిజ‌ర్వేష‌న్ల‌పై విచార‌ణ నేప‌థ్యంలో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని చెప్పింది.  ఎల్ నాగేశ్వ‌రరావు, హేమంత్ గుప్తా, ఎస్ ర‌వీంద్ర భ‌ట్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. వాస్త‌వానికి నేటి నుంచి ఈ అంశంపై రోజువారీ విచార‌ణ ప్రారంభం కావాల్సి ఉన్న‌ది. అయితే సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు ఎటువంటి రిక్రూట్మెంట్ చేప‌ట్ట‌మ‌ని ప్ర‌భుత్వం చెప్ప‌డంతో.. కేసు విచార‌ణ‌ను సెప్టెంబ‌ర్ ఒక‌టవ తేదీకి వాయిదా వేశారు. ఉద్యోగాలు, విద్యా సంస్థ‌ల్లో మ‌రాఠాల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ తీసుకున్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లైంది.  మ‌రాఠాల‌కు ప్ర‌త్యేకంగా 12 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డంతో.. ఆ రాష్ట్రంలో కోటా మొత్తం 74 శాతానికి చేరుకున్న‌ది. 50 శాతం కోటా సీలింగ్ దాటిన నేప‌థ్యంలో కోర్టులో కేసు న‌మోదు చేశారు.  


logo