శుక్రవారం 05 జూన్ 2020
National - May 07, 2020 , 15:13:17

టోకెన్లు ఇవ్వమనండి.. లేదా ఇంటికి పంపమనండి

టోకెన్లు ఇవ్వమనండి.. లేదా ఇంటికి పంపమనండి

కరోనా కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు పలు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే తెరుచుకొంటున్నాయి. తొలుత ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలవగా.. ఆ తర్వాత మరికొన్ని రాష్ట్రాలు కూడా వాటి మార్గంలో నడిచాయి. అయితే, చాలా రాష్ట్రాల్లో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకపోవడం కనిపిస్తున్నది. దాంతో కరోనా వైరస్‌ ఉధృతి పెరుగొచ్చనే భయాందోళనలు కనిపిస్తున్నాయి.

దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పౌరుడు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. మద్యం దుకాణాల వద్ద విచ్చలవిడిగా మద్యం ప్రియులు రావడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందున.. టోకెన్‌ విధానాన్ని గానీ, ఇంటికి సరఫరా చేయడం వంటి విధానాలను గానీ ప్రవేశపెట్టేలా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించాడు. విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.


logo