శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 16:12:11

2040 నాటికి స‌ముద్రంలో మూడురెట్ల ప్లాస్టిక్ వ్య‌ర్థాలు

2040 నాటికి స‌ముద్రంలో మూడురెట్ల ప్లాస్టిక్ వ్య‌ర్థాలు

న్యూఢిల్లీ: మ‌రో 20 ఏండ్ల‌లో స‌ముద్రంలోని ప్లాస్టిక్ వ్య‌ర్థాలు మూడురెట్ల మేర పెరుగుతాయ‌ని ఒక అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. దీనివ‌ల్ల జ‌ల జీవుల ప్రాణాల‌కు ఎన‌లేని ముప్పు వాటిల్లుతుంద‌ని హెచ్చ‌రించింది. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలు, కంపెనీలు ప్లాస్టిక్ వ్య‌ర్థాల‌ను త‌గ్గించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించింది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఒక‌సారి వినియోగించే ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ఇటీవ‌ల గ‌ణ‌నీయంగా పెరిగాయ‌ని ఒక స్వ‌చ్చంధ సంస్థ‌కు చెందిన‌ అంత‌ర్జాతీయ ఘ‌న వ్య‌ర్థాల సంఘం  తెలిపింది. ఆసియా దేశాల స‌ముద్ర తీరాల్లోని బీచ్‌ల వ‌ద్ద‌కు నిత్యం మాస్కులు, ప్లాస్టిక్ చేతితొడుగులు, ఇత‌ర వ్య‌ర్థాలు కొట్టుకువ‌స్తున్నాయ‌ని చెప్పింది. 

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డ‌ర్లు, ఇత‌ర ప్యాకేజీ వ‌స్తువుల స‌ర‌ఫ‌రా పెరిగింద‌ని, దీంతో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో వీటి వ్య‌ర్థాలు పేరుకుపోతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో  2040 నాటికి స‌ముద్రంలో క‌లిసే ప్లాస్టిక్ వ్య‌ర్థాలు 11 మిలియ‌న్ ట‌న్నుల నుంచి 29 మిలియ‌న్ ట‌న్నుల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేసింది. దీంతో స‌ముద్రంలో ఉన్న మొత్తం ప్లాస్టిక్ వ్య‌ర్థాలు 600 మిలియ‌న్ ట‌న్నుల‌కు పెరుగుతుంద‌ని, ఇది 3 మిలియ‌న్ బ్లూవేల్ బ‌రువున‌కు స‌మాన‌మ‌ని పేర్కొంది. ప్లాస్టిక్ వ్య‌ర్థాల పెరుగుద‌ల ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య అని, ఇప్ప‌టికైనా మేల్కోక‌పోతే జ‌రిగే న‌ష్టాల్ని మ‌నమంతా ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని సైన్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన ఈ అధ్య‌యనం హెచ్చ‌రించింది. 


logo