ఆదివారం 12 జూలై 2020
National - Jun 29, 2020 , 12:32:37

ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తాం : సీఎం కేజ్రీవాల్‌

ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తాం :  సీఎం కేజ్రీవాల్‌

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ చికిత్స‌లో ప్లాస్మా థెరిపి కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే త‌మ రాష్ట్రంలో ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌19 రోగుల చికిత్స కోసం ప్లాస్మా కొర‌త ఉన్న‌ద‌ని, ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ఐఎల్‌బీఎస్ హాస్పిట‌ల్‌లో ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు సీఎం తెలిపారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాను దానం చేయాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించారు.   

డాక్ట‌ర్ అసీమ్ గుప్తా కుటుంబానికి కోటి న‌ష్ట‌ప‌రిహారాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఎల్ఎన్‌జేపీ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ అసీమ్ గుప్తా మృతి ప‌ట్ల సీఎం కేజ్రీ విచారం వ్య‌క్తం చేశారు.  డాక్ట‌ర్ అసీమ్ లాంటి వారి వ‌ల్లే మ‌నం కోవిడ్‌19తో పోరాడుతున్నామ‌న్నారు. ఆ డాక్ట‌ర్ కుటుంబానికి కోటి ప‌రిహారం ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  


logo