శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 01, 2020 , 19:09:51

గ్రీన్‌ చాలెంజ్‌.. మొక్కలు నాటిన అరకు ఎమ్మెల్యే

గ్రీన్‌ చాలెంజ్‌.. మొక్కలు నాటిన అరకు ఎమ్మెల్యే

అరకు: రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులు, సామాన్యులు లక్షలాది మొక్కలు నాటారు. కాగా, ఇవాళ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటారు. ఈ రోజు ఆయన జన్మదినం కావడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉండాల్సిన అడవుల శాతం కన్నా తక్కువ శాతం అడవులు ఉన్నాయనీ.. మనం మొక్కలు నాటి అడవుల శాతం పెంచాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం వల్ల మనం భవిష్యత్‌ తరాలకు భరోసా ఇచ్చినట్లవుతుందని ఎమ్మెల్యే అన్నారు.

ప్రతి ఒక్కరి జీవన విధానంలో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం భాగమవ్వాలని  ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే తెలిపారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌తో పర్యావరణ పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఎంపీ సంతోష్‌ కుమార్‌కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే.. మరింత మంది మొక్కలు నాటాలని సవాలు విసిరారు. 


logo