పలు ఆలయాల్లో మంత్రి దంపతుల పూజలు
మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు
మధిర, ఎర్రుపాలెం, బోనకల్, ముదిగొండ, చింతకాని ఏప్రిల్ 19: మధిర నియోజకవర్గవ్యాప్తంగా సోమవారం మంత్రి అజయ్‌కుమార్ జన్మదిన వేడుకలు జరిగాయి. నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. మధిరలో జరిగిన వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, ఎంపీపీ మెండెం లలిత, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముదిగొండ, ఎర్రుపాలెం, బోనకల్లు మండలాల్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో మంత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: చెన్నై మురిసె..రాజస్థాన్‌కు నిరాశ
సీఎం కోలుకోవాలని మంత్రులు హరీశ్, సత్యవతి ఆకాంక్ష