శనివారం 06 జూన్ 2020
National - May 21, 2020 , 13:55:28

పశ్చిమబెంగాల్‌ సహకరించడంలేదు: పీయూష్‌ గోయల్‌

పశ్చిమబెంగాల్‌ సహకరించడంలేదు: పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరించడం, దాన్ని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ అమల్లోకి రావడం లాంటి పరిణమాల నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఎక్కడి వాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారిని సొంత రాష్ట్రాలకు తరలించడం కోసం కేంద్రం ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారు. 

అయితే, ఈ వలస కూలీలను తరలింపునకు కొన్ని రాష్ట్రాలు సహకరించడంలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ చెప్పారు. ప్రత్యేకించి మమతాబెనర్జి నేతృత్వంలోని పశ్చిమబెంగాల్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన దాదాపు 40 లక్షల మంది వలస కూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని స్వరాష్ట్రానికి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారని, కానీ బెంగాల్‌ సర్కారు మాత్రం ఇప్పటివరకు కేవలం 27 ప్రత్యేక రైళ్లకు మాత్రమే ఆ రాష్ట్రంలో ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చిందని గోయల్‌ ఆరోపించారు.  


logo