బుధవారం 27 జనవరి 2021
National - Jan 14, 2021 , 01:39:09

సైన్యం కోసం స్వదేశీ పిస్టల్‌

సైన్యం కోసం  స్వదేశీ పిస్టల్‌

న్యూఢిల్లీ: భారత సైన్యం కోసం తొలిసారిగా దేశీయంగా అధునాతన మెషిన్‌ పిస్టల్‌ ‘ఏఎస్‌ఎమ్‌ఐ’ని అభివృద్ధి చేసినట్టు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం బలగాలు వినియోగిస్తున్న 9ఎంఎం పిస్టళ్ల స్థానంలో వీటిని వాడుతారు.  ఆర్మీ ఆవిష్కరణల ప్రదర్శన కార్యక్రమంలో బుధవారం ఈ పిస్టల్‌ను ప్రదర్శించారు. దీని రేంజ్‌ 100 మీటర్లు. మరోవైపు, మానవ రహిత వాహనాల (యూఏవీ) కోసం రూపొందించిన ‘రిట్రాక్టబుల్‌ ల్యాండ్‌ గేర్‌ వ్యవస్థలను ఆదివారం నౌకాదళానికి అప్పగించారు. 


logo