గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 15:54:45

బీజేపీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌చిన్: కాంగ్రెస్ నేత పునియా

బీజేపీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌చిన్: కాంగ్రెస్ నేత పునియా

ల‌క్నో: రాజ‌స్థాన్ మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ బీజేపీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నార‌ని, ప్ర‌స్తుతం హ‌ర్యానాలోని ఓ హోట‌ల్‌లో ఉంటున్నార‌ని కాంగ్రెస్‌పార్టీ సీనియ‌ర్ నేత పీఎల్ పునియా ఆరోపించారు. సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర‌ప‌న్నింద‌ని, ఆ పార్టీ ఆధ్వ‌ర్యంలోనే ఇవ‌న్నీ జ‌రుగుతున్నాయనే విష‌యం స్ఫ‌ష్ట‌మ‌వుతున్న‌ద‌ని విమ‌ర్శించారు. స‌చిన్ పైల‌ట్‌తోస‌హా ఆయ‌న‌ వ‌ర్గంలోని ఎమ్మెల్యేలు హ‌ర్యానాలోనే ఉన్నార‌ని చెప్పారు. బ‌య‌టి వ్య‌క్తుల‌ను క‌ల‌వ‌డానికి వారిని అనుమ‌తించ‌డంలేద‌ని ఆరోపించారు. వారు బీజేపీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే అక్క‌డ ఉంటున్నార‌ని చెప్పారు. 

కాగా, రాజ‌స్థాన్ ప్ర‌భుత్వంలో ఏర్ప‌డిన సంక్షోభంలో హ‌ర్యానా పాత్ర ఏమీలేద‌ని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ ప్ర‌క‌టించారు. స‌చిన్ పైల‌ట్ వ‌ర్గానికి చెందిన 18 ఎమ్మెల్యేల‌కు తామ రాష్ట్రంలో ఆశ్ర‌యం క‌ల్పించ‌లేద‌ని చెప్పారు. 


logo