మంగళవారం 31 మార్చి 2020
National - Mar 23, 2020 , 11:01:47

కరోనా ఎఫెక్ట్‌.. కాక్‌పిట్‌ విండో నుంచి దిగిన పైలట్‌

కరోనా ఎఫెక్ట్‌.. కాక్‌పిట్‌ విండో నుంచి దిగిన పైలట్‌

న్యూఢిల్లీ : ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ అనుమానిత వ్యక్తి ఉన్నాడన్న సమాచారంతో భయాందోళనకు గురైన పైలట్‌ అందరూ దిగే మార్గం గుండా కాకుండా కాక్‌పిట్‌ విండో నుంచి క్రిందకు దిగాడు. ఈ ఘటన గడిచిన శుక్రవారం చోటుచేసుకుంది. ఎయిర్‌ ఏసియాకు చెందిన విమానం పూణె నుంచి ఢిల్లీకి చేరుకుంది. ప్రయాణికుల్లో కోవిడ్‌-19 వ్యాధి అనుమానితుడు ఉన్నట్లుగా సమాచారం. సురక్షిత చర్యల్లో భాగంగా విమానాన్ని పార్కింగ్‌ నిమిత్తం మొదట రిమోట్‌ బేకు తరలించారు. ప్రయాణికులందరికి పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా దిగే మార్గం గుండా విమాన సిబ్బంది, ప్రయాణికులు అందరూ కిందకు దిగారు. తర్వాత పైలట్‌ ఆ మార్గం ద్వారా కాకుండా కాక్‌పిట్‌ విండో మార్గం ద్వారా కిందకు దిగాడు. ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా ప్రవర్తించాలో తమ సిబ్బంది పూర్తిగా సుశిక్షితులైనట్లు ఎయిర్‌ ఏసియా అధికారిక ప్రతినిధి తెలిపారు. విమానాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే తిరిగి వినియోగించడం జరినట్లు తెలిపారు. 


logo
>>>>>>