సోమవారం 01 జూన్ 2020
National - May 18, 2020 , 10:32:02

లాక్‌డౌన్‌ ఉల్లంఘనులకు దడ పుట్టిస్తున్న ఢిల్లీ పోలీసులు

లాక్‌డౌన్‌ ఉల్లంఘనులకు దడ పుట్టిస్తున్న ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ : దేశమంతా కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం విదితమే. ఈ కరోనా విజృంభణ దేశ రాజధాని ఢిల్లీలో అధికంగా ఉంది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉల్లంఘనులకు దడ పుట్టించేలా ఢిల్లీ పోలీసులు వినూత్న ఆలోచనకు తెరతీశారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారికి డమ్మీ కరోనా మృతదేహాన్ని చూపించి వణుకు పుట్టిస్తున్నారు. 

ఢిల్లీలోని మందవాలీ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇద్దరు యువకులు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి.. బైక్‌పై రోడ్డుపైకి వచ్చారు. వీరిద్దరిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నారు. ఎట్టకేలకు వారిని పట్టుకున్న పోలీసులు.. డమ్మీ కరోనా మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాలని ఆదేశించారు. దీంతో ఇద్దరు యువకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి ఆ డమ్మీ మృతదేహాన్ని భుజాలపై మోయించారు పోలీసులు. అయితే కరోనాతో చనిపోయినట్లు విధుల్లో ఉన్న ఓ పోలీసు స్ట్రెచర్‌పై పడుకుని ఉన్నాడు.

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. అవసరమైతేనే నివాసాల నుంచి బయటకు రావాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


logo