మంగళవారం 31 మార్చి 2020
National - Mar 08, 2020 , 16:55:33

ఫోన్‌పే వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌..!

ఫోన్‌పే వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌..!

ముంబై: ఫోన్‌ పే సంస్థ తన యాప్‌ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. యెస్‌ బ్యాంకు ఆర్థిక సంక్షోభం వల్ల ఫోన్‌ పే సేవలకు గత 2, 3 రోజులుగా అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఫోన్‌పే సంస్థ ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఫోన్‌ పే సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఇకపై వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్‌పేలో నగదు చెల్లింపులు, నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చని ఫోన్‌ పే తెలిపింది. ఇక ఈ సేవలను అందించేందుకు గాను ముందుకు వచ్చిన ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు తమకు సహకారం అందించిన నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)కి ఫోన్‌ పే సీఈవో సమీర్‌ నిగమ్‌ ధన్యవాదాలు తెలిపారు. 


logo
>>>>>>