ఆదివారం 05 జూలై 2020
National - Jun 17, 2020 , 13:35:11

కెనడా ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

కెనడా ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

ఢిల్లీ : భారత్‌-కెనడా ప్రధానుల మధ్య నేడు ఫోన్‌ సంభాషణ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడోతో ఫోన్‌లో సంభాషించారు. కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో ఇరు దేశాల్లోని ప్రస్తుత పరిస్థితులపై ప్రధానులిరువురు చర్చించారు. అదేవిధంగా ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు సంయుక్త భాగస్వామ్యం, సహకారంపై నేతలు చర్చించారు. కోవిడ్‌ అనంతరం భారత్‌-కెనడా దేశాల సంబంధాలు బలంగా ముందుకు వెళ్తున్నాయన్నారు. 

డబ్ల్యూహెచ్‌ఓను బలోపేతం చేయాల్సిన అవసరం అదేవిధంగా హెల్త్‌, సోషల్‌, ఎకానమిక్‌, రాజకీయ అంశాల్లో అంతర్జాతీయ వేదికలపై కలిసి మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిందిగా పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు కెనడా ప్రభుత్వం అందించిన సహాయంపై అదేవిధంగా వారిని స్వదేశం తీసుకువచ్చేందుకు అక్కడి అధికారులు అందించిన చేయూతను మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ అంశంపై కెనడా ప్రధాని సైతం ఇదేవిధంగా స్పందించారు. రాబోయే రోజుల్లో సైతం తమ భాగస్వామ్యం ఇదే విధంగా మరింత బలోపేతం చేస్తూ సాగుదామని ఇరు దేశాల నేతలు అంగీకారానికి వచ్చారు.


logo