శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 12, 2020 , 02:07:55

అలీగఢ్‌ వీసీ.. టీకా వలంటీర్‌!

అలీగఢ్‌ వీసీ.. టీకా వలంటీర్‌!

  • కొవాగ్జిన్‌ ఫేజ్‌ 3 ట్రయల్స్‌ ప్రారంభం

అలీగఢ్‌, నవంబర్‌ 11: కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘భారత్‌ బయోటెక్‌' సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘కొవాగ్జిన్‌' టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలోని జేఎన్‌ మెడికల్‌ కాలేజీ, దవాఖానలో నిర్వహించే ట్రయల్స్‌కు తొలి వలంటీర్‌గా ఆ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ తారిఖ్‌ మన్సూర్‌ పేరు నమోదుచేసుకున్నారు. ట్రయల్స్‌లో పాల్గొనాల్సిందిగా ఇతరులను కూడా ఆయన ప్రోత్సహించారు. ట్రయల్స్‌లో పాల్గొనేవారికి  ప్రయాణ ఖర్చులు, ఇతర సదుపాయాలు కల్పించనున్నట్లు ఏఎంయూ అధికార ప్రతినిధి తెలిపారు. కొవాగ్జిన్‌ ఫేజ్‌-3 ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మందిపై నిర్వహించనున్నారు. ప్రస్తుతం దేశంలో మరో రెండు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ టీకా తుది దశ ట్రయల్స్‌లో ఉండగా, జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ రెండో దశ ట్రయల్స్‌ జరుపుకుంటున్నది.