మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 17:15:15

లక్నో, గోరఖ్‌పూర్‌లో ‘కొవాగ్జిన్‌’ మూడో దశ ట్రయల్స్‌

లక్నో, గోరఖ్‌పూర్‌లో ‘కొవాగ్జిన్‌’ మూడో దశ ట్రయల్స్‌

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, గోరఖ్‌పూర్‌లో వచ్చే నెల అక్టోబర్‌లో కొవాగ్జిన్‌ టీకా ఫేజ్‌-3 ట్రయల్స్‌ను ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. కాగా, టీకాను హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. కంపెనీ ఫేజ్‌-3లో 20వేల నుంచి 30వేల మందిపై వ్యాక్సిన్‌ వేయాలని కంపెనీ యోచిస్తోంది. ముఖ్యంగా కొవాక్సిన్ అభివృద్ధి కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) భారత్ బయోటెక్‌తో కలిసి పనిచేస్తోంది. అలాగే కరోనా వైరస్‌కు ఒకే మోతాదు ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్ అమెరికాలోని మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ బయోటెక్‌కు అమెరికా, జపాన్, యూరప్ మినహా అన్ని మార్కెట్లలో వ్యాక్సిన్ పంపిణీ చేసే హక్కులు ఉన్నాయని కంపెనీ బుధవారం ప్రకటించింది. కంపెనీ ఇతర భాగస్వాములతో కూడా చర్చలు జరుపుతున్నది. 4, 5 దేశాల్లో వ్యాక్సిన్ తయారు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇది కొవాక్సిన్ తయారీ సామర్థ్యం సంవత్సరానికి కనీసం ఒక బిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయాలని చూస్తోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo