గురువారం 04 జూన్ 2020
National - May 08, 2020 , 18:39:14

మే 15 నుంచి రెండో విడత వందే భారత్‌

మే 15 నుంచి రెండో విడత వందే భారత్‌

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వస్థలాలకు చేరవేస్తున్నది. ఇందులో భాగంగా చేపట్టిన వందే భారత్‌ కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతున్నది. అయితే రెండో విడత వందే భారత్‌ను మే 15 నుంచి ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ దఫా రష్యా, ఉక్రెయిన్‌, థాయ్‌లాండ్‌, స్పెయిన్‌, జర్మనీ, సీఐఎస్‌ దేశాలైన అర్మేనియా, అజర్‌బైజన్‌, బెలారస్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, మాల్దోవా, తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లలో చిక్కుకు పోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురానుంది. 

మొదటి విడత వందే భారత్‌ కార్యక్రమం మే 7 నుంచి 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా అమెరికా, యూకే, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, సౌదీ అరేబియా, కువైట్‌, ఫిలిప్పీన్స్‌, యూఏఈ, మలేషియాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాల్లో  కేంద్రప్రభుత్వం ఇప్పటికే తరలిస్తున్నది.


logo