శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 15:07:18

ఫైజర్ కరోనా టీకా భారత్‌కు సవాల్‌: రణదీప్ గులేరియా

ఫైజర్ కరోనా టీకా భారత్‌కు సవాల్‌: రణదీప్ గులేరియా

న్యూఢిల్లీ: ఫైజర్ కరోనా టీకా భారత్‌ వంటి దేశాలకు సవాల్‌తో కూడుకున్నదని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను -70 సెంటీగ్రెట్‌ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలని చెప్పారు. దీంతో ఈ సంస్థ టీకా శీతలీకరణ నిర్వాహణ, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నిల్వచేయడం కష్టసాధ్యమన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఫైజర్‌ టీకా సవాల్‌ అని ఆయన చెప్పారు. అయితే ఫైజర్‌ టీకా మూడో దశ ట్రయల్స్‌ 90 శాతం విజయవంతమన్న  వార్తలు కరోనా వ్యాక్సిన్‌ పరిశోధనకు ప్రోత్సాహకరమని అన్నారు.

మరోవైపు ఢిల్లీలో కరోనా విజృంభణపై రణదీప్‌ గులేరియా స్పందించారు. ఈవెంట్స్‌కు పెద్ద సంఖ్యలో హాజరుకావడం, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోవడం వైరస్‌ సూపర్ స్ప్రెడ్‌కు కారణమని ఆయన అభిప్రయపడ్డారు. ఢిల్లీలో కరోనా కేసుల నమోదు తీవ్రతను తగ్గించేందుకు యంత్రాంగం దూకుడుగా పని చేయాలని సూచించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.