మంగళవారం 14 జూలై 2020
National - Jun 24, 2020 , 03:07:48

17వ రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

17వ రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 17వ రోజు మంగళవారం కూడా పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌పై 20 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 55 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో 17 రోజుల వ్యవధిలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.5, లీటర్‌ డీజిల్‌పై రూ.10.01 పెరిగింది. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.79.76కు చేరుకోగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.79.40కి పెరిగింది. 


logo