మంగళవారం 26 జనవరి 2021
National - Jan 07, 2021 , 01:42:57

రికార్డు స్థాయికి పెట్రోల్‌ ధరలు

రికార్డు స్థాయికి పెట్రోల్‌ ధరలు

న్యూఢిల్లీ: దాదాపు నెలరోజుల విరామం తర్వాత చమురు కంపెనీలు పెట్రోల్‌ ధరలను పెంచాయి. బుధవారం లీటర్‌ పెట్రోల్‌ ధర 26 పైసలు, డీజిల్‌ ధర 25 పైసల చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.83.97, డీజిల్‌ రేటు రూ.74.12కు చేరుకొన్నది. తాజా ధరల పెంపుతో పెట్రోల్‌ రేట్లు రికార్డు సృష్టించాయి. 2018 అక్టోబర్‌ 4న  పెట్రోల్‌ రేట్‌ రూ. 84, డీజిల్‌ రేటు రూ. 75.45గా ఉన్నాయి. దేశచరిత్రలో పెట్రో రేట్లలో ఇప్పటివరకు ఇదే అత్యధికం  కాగా, తాజా రేట్లు రెండో స్థానంలో నిలిచాయి.


logo