బుధవారం 08 జూలై 2020
National - Jun 23, 2020 , 03:09:44

పెట్రో మంట రూ.82 దాటిన పెట్రోల్‌

పెట్రో మంట రూ.82 దాటిన పెట్రోల్‌

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సోమవారం కూడా పెరిగాయి. లీటరు పెట్రోల్‌ 33 పైసలు పెరగ్గా, డీజిల్‌ ధర 58 పైసలు పెరిగింది. జూన్‌ 7 నుంచి ఇప్పటివరకు  పెట్రోల్‌ ధర రూ.8.30 పెరగ్గా, డీజిల్‌ రూ.9.46 పెరిగింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82 దాటింది. కేవలం 15 రోజుల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో రేట్లు పెరగడం 2002 తర్వాత ఇదే తొలిసారి.


logo