మంగళవారం 02 మార్చి 2021
National - Jan 23, 2021 , 09:11:39

వరుసగా రెండో రోజూ పెరిగిన పెట్రో ధరలు

వరుసగా రెండో రోజూ పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. నిన్న లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు, ఇవాళ మరో 25 పైసలు వడ్డించాయి. దీంతో ఢిల్లీతోపాటు, దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డుస్థాయికి చేరాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.85.70కు, డీజిల్‌ ధర రూ.75.88కి పెరిగాయి. ఢిల్లీలో పెట్రో ధరలు ఈస్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. కాగా, ముంబైలో పెట్రోల్‌ రూ. 92.28, డీజిల్‌ రూ.82.66కి చేరాయి. 

గత 22 రోజులుగా చమురు కంపెనీలు క్రమం తప్పకుండా ధరలు పెంచుతూ వస్తున్నాయి. దీంతో జైపూర్‌లో చమురు ధరలు అత్యధికానికి చేరాయి. అయితే అక్కడ నిన్నటికంటే ధరలు కాస్తా తగ్గడం విశేషం. నిన్న లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.44గా ఉండగా, ఈరోజు రూ.93.08కు తగ్గింది. అదేవిధంగా డీజిల్‌ ధరలు రూ.85.45 నుంచి రూ.85.15కు తగ్గాయి. 

ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90కి చేరువయ్యింది. ప్రస్తుతం పెట్రోల్‌ ధర రూ.89.15గా ఉండగా, డీజిల్ ధర రూ. 82.80కు చేరాయి. బెంగళూరులో పెట్రోల్‌ రూ.88.59, డీజిల్‌ రూ.80.47, చెన్నైలో పెట్రోల్‌ రూ.88.38, డీజిల్‌ రూ.82.23, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.87.11, డీజిల్‌ రూ.79.48కి చేరాయి.  

VIDEOS

logo