బుధవారం 08 జూలై 2020
National - Jun 29, 2020 , 07:08:37

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: ఒక్క రోజు విరామంత తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ నెల 7 నుంచి 22 రోజులపాటు కొనసాగిన పెట్రో ధరల పెంపునకు దేశీయ చమురు కంపెనీలు ఆదివారం కాస్త విరామం ఇచ్చాయి. అయితే మళ్లీ ఈ రోజు పెట్రో, డీజిల్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.43, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.53కి చేరింది. దీంతో ఇప్పటివరకు డీజిల్‌పై మొత్తం రూ.10.39, పెట్రోల్‌పై రూ.9.23 పైసలు పెరిగాయి. 

వరుసగా ఐదు రోజలపాటు పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరల పెరుగుదల కొనసాగింది. మళ్లీ సోమవారం కూడా పెట్రోల్‌ కంటే లీటర్‌ డీజిల్‌ ధర 8 పైసలు అధికంగా ఉన్నది. దేశంలో మొదటిసారిగా జూన్‌ 24న డీజిల్‌ ధరలు పెట్రోల్‌ ధరలను దాటాయి. శనివారం పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పెంచడంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.38గా, డీజిల్‌ ధర రూ.80.40గా ఉన్నది. ఆదివారం పెట్రో డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.


logo