గురువారం 16 జూలై 2020
National - Jun 20, 2020 , 08:14:41

14వ రోజూ పెరిగిన పెట్రో ధరలు

14వ రోజూ పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో వడ్డన కొనసాగుతున్నది. వరుసగా 14వ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ పెట్రోలియం కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 61 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.78.88కి, డీజిల్‌ ధర రూ.77.67కి చేరాయి. ఈ పెంపుతో దేశంలో పెట్రో, డీజిల్‌ ధరలు 19 నెలల గరిష్టానికి చేరాయి. 

ఈ నెల 9 నుంచి పెట్రో ధరలు పెరుగుతుండటంతో చమురు కంపెనీలు దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.5.88పైసలు, డీజిల్‌పై రూ.6.50పైసలు అధికమయ్యాయి. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 80.62, డీజిల్‌ రూ.76.11, చెనైలో పెట్రోల్‌ ధర రూ. 82.27, డీజిల్‌ రూ.75.29గా ఉన్నాయి.


logo