గురువారం 02 జూలై 2020
National - Jun 27, 2020 , 06:35:34

ఆగని పెట్రో మంట.. 21 రోజూ పెరిగిన ధరలు

ఆగని పెట్రో మంట.. 21 రోజూ పెరిగిన ధరలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు పరంపర కొనసాగుతున్నది. వరుసగా 21వ రోజూ పెట్రో డీజిల్‌ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.38, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.40కి చేరింది. దీంతో 21 రోజుల్లో డీజిల్‌పై మొత్తం రూ.10.27, పెట్రోల్‌పై రూ.9.18 పైసలు పెరిగాయి. 

లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత జూన్‌ 7 నుంచి దేశంలో పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జూన్‌ 1న లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.71.26గా ఉండగా, ప్రస్తుతం అది రూ.80.33కి చేరింది. నిన్న పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెంచాయి.


logo