మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 22, 2020 , 11:14:05

వరుసగా మూడోరోజూ పెరిగిన పెట్రో ధరలు

వరుసగా మూడోరోజూ పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: వరుసగా మూడోరోజూ పెట్రో ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ డీజిల్‌పై 18 నుంచి 20 పైసలు, లీటర్‌ పెట్రోల్‌పై 8 పైసలు పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.81.46, డీజిల్‌ రూ.71.07గా ఉన్నది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.88.16, డీజిల్‌ ధర రూ.77.54కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.83.03, డీజిల్‌ రూ.74.64, చెన్నైలో పెట్రోల్‌ రూ. 84.53, డీజిల్‌ రూ.76.55గా ఉంది. కాగా, పెట్రో ఉత్పత్తులపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా పన్నులు వసూలు చేస్తుండటంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కోవిధంగా ఉంటాయి.