గురువారం 09 జూలై 2020
National - Jun 19, 2020 , 07:30:38

ఆగని పెట్రో మంట

ఆగని పెట్రో మంట

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో మంట ఆరడం లేదు. వరుసగా 13వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. శుక్రవారం లీటర్‌ పెట్రోల్‌పై 56 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 63 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. మొత్తం 12 రోజుల పెరుగుదలను లెక్కిస్తే లీటర్‌ పెట్రోల్‌పై రూ.7.11, లీటర్‌ డీజిల్‌పై రూ.7.67 పైసలు పెరిగాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.78.37, లీటర్‌ డీజిల్‌ ధర రూ.77.06కు చేరింది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.91, డీజిల్‌ ధర రూ.73.28కి పెరిగాయి. అయితే రాష్ర్టాల్లో స్థానిక పన్నులను బట్టి పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు ఉండనున్నాయి.

రోజువారీ పెట్రో ధరల సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు జూన్‌ 7వ తేదీ నుంచి పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచుతూ వస్తున్నాయి. మార్చి నెలలో పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం రూ. 10 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీ విధించాయి. దీంతో పెంట్రోలియం కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి.


logo