శనివారం 06 మార్చి 2021
National - Jan 22, 2021 , 09:05:55

కొనసాగుతున్న పెట్రో బాదుడు.. రూ.93 దాటిన పెట్రోల్‌ ధర

కొనసాగుతున్న పెట్రో బాదుడు.. రూ.93 దాటిన పెట్రోల్‌ ధర

న్యూఢిల్లీ: వాహదారులపై పెట్రోబాదుడు కొనసాగుతున్నది. మరోమారు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ దేశీయ ముడిచమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.85.45కు చేరింది. ఇక డీజిల్‌ ధర రూ. 75.63కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.92 దాటింది. మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.04, డీజిల్ ధర రూ.82.40గా ఉంది. కాగా, పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధమైన పన్నులు వసూలు చేస్తుండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. 

  • హైదరాబాద్‌- పెట్రోల్ రూ.88.89, డీజిల్ రూ.82.53  
  • విజయవాడ- పెట్రోల్ రూ.91.33, డీజిల్ రూ.85.08  
  • జైపూర్‌- పెట్రోల్‌ రూ.93.06, డీజిల్‌ రూ.85.08
  • కోల్‌కతా- పెట్రోల్ రూ.86.87, డీజిల్ రూ79.23
  • చెన్నై- పెట్రోల్ రూ.88.07, డీజిల్ రూ.80.90
  • బెంగళూరు- పెట్రోల్ రూ.88.33, డీజిల్ రూ.80.20

VIDEOS

logo