గురువారం 16 జూలై 2020
National - Jun 23, 2020 , 08:32:03

17వ రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

17వ రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఢిల్లీ:  దేశంలో మరోమారు పెట్రో, డీజి‌ల్‌ ధరలు పెరిగాయి. వరుసగా 17 వ రోజు కూడా ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌ లీటర్‌కు  20 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంచాయి. ఢిల్లీలో  పెట్రోల్‌ లీటర్‌కు రూ. 79.96, డీజిల్‌ లీటర్‌కు రూ. 79.40కు చేరుకుంది.

కోల్‌కతాలో పెట్రోల్‌ రూ. 81.45, డీజిల్‌ 74.63, చెన్నైలో  పెట్రోల్‌ రూ.83.04, డీజిల్‌ రూ. 76.77, బెంగుళూర్‌లో పెట్రోల్‌ రూ. 82.35, డీజిల్‌ రూ. 75.51, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ. 82.79, డీజిల్‌ రూ. 77.60, ముంబైలో పెట్రోల్‌ రూ. 86.54, డీజిల్‌ రూ. 77.76 పైసలకు చేరుకుంది  


logo