సోమవారం 06 జూలై 2020
National - Jun 15, 2020 , 07:43:49

తొమ్మిదో రోజూ పెరిగిన పెట్రో, డీజిల్‌ ధరలు

తొమ్మిదో రోజూ పెరిగిన పెట్రో, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: దేశీయ పెట్రోలియం కంపెనీలు వినియోగదారులపై మరోమారు భారం మోపాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రో ధరలను పెంచుతూనే ఉన్నాయి. ఈ నెల 7వ తేదీ తర్వాత వరుసగా తొమ్మిదో రోజూ పెట్రో, డీజిల్‌ ధరలను పెంచాయి. రోజువారీ సమీక్షలో భాగంగా ఈ రోజు లీటర్‌ పెట్రోల్‌పై 48 పైసలు, డీజిల్‌పై 59 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.76.26కి పెరగగా, డీజిల్‌ ధర రూ.74.62కు చేరింది. 

మార్చి నెలలో కేంద్రప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకం విధించింది. ఆ లోటును పూడ్చుకోవడానికి చమురు కంపెనీలు పెట్రో ధరలను గత తొమ్మిదిరోజులుగా ప్రతి రోజూ పెంచుతూ వస్తున్నాయి. దీంతో ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.83.17, డీజిల్‌ ధర రూ.73.21గా ఉన్నది. చెన్నైలో పెట్రోల్‌ రూ.79.96, డీజిల్‌ రూ.72.69గా, కోల్‌కతాలో రూ.78.10గా, డీజిల్‌ ధర రూ.70.33కి చేరుకున్నది. 


logo