శనివారం 11 జూలై 2020
National - Jun 22, 2020 , 08:55:14

కొనసాగుతున్న పెట్రో మంట

కొనసాగుతున్న పెట్రో మంట

న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉన్నది. వరుసగా 16వ రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 33 పైసలు, 58 పైసల చొప్పున పెంచడంతో రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.79.56కు, డీజిల్‌ ధర రూ.78.85కు చేరాయి. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.86.36, డీజిల్‌ ధర రూ.77.24, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.81.27, డీజిల్‌ రూ.74.14కు పెరిగాయి. ఆదివారం పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 60 పైసల చొప్పున పెంచాయి. జూన్‌ 7వ తేదీ నుంచి వరుసగా పెట్రో ధరలను పెంచుతుండటంతో ఇప్పటివరకు లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.30, డీజిల్‌పై రూ.9.22పైసలు అధికమయ్యాయి. 

దేశంలో గతంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రతి 15 రోజులకు ఒకసారి పెంచే విధానం అమల్లో ఉన్నది. అయితే ఈ విధానాన్ని 2017 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు పెట్రో ధరలను సమీక్షించుకునేల చమురు కంపెనీలకు ప్రభుత్వం స్వేచ్ఛను కల్పించింది. దీంతో ప్రతి రోజు పెట్రో ధరల్లో మార్పులు చోటుచోసుకుంటున్నాయి.


logo