శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 23, 2020 , 01:49:40

మూడో రోజూ పెట్రో వాత

మూడో రోజూ పెట్రో వాత

న్యూఢిల్లీ, నవంబర్‌ 22: గత మూడు రోజుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 8 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 19 పైసలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.81.46 పెరిగింది. లీటర్‌ డీజిల్‌ ధర రూ.71.07కి చేరింది. గత మూడు రోజుల్లో పెరిగిన ధరలను కలిపి లెక్కిస్తే పెట్రోల్‌పై 40 పైసలు, డీజిల్‌పై 61 పైసలు పెరిగినట్లు తేలింది. దేశంలో కరోనా కేసులు వెలుగు చూసిన తొలి రోజుల్లోనూ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. దీంతో సామాన్యుడిపై భారం పడింది. ధరల పెంపుదలకు కొన్ని రోజులపాటు విరామం ఇచ్చిన కంపెనీలు మళ్లీ తమ పాత పంథాలో నడుస్తున్నాయి. తాజాగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరుసగా ధరలను పెంచాయి.