శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 06, 2020 , 00:44:44

భగ్గుమంటున్న పెట్రో ధరలు

భగ్గుమంటున్న పెట్రో ధరలు

  • రెండేండ్ల గరిష్ఠానికి చేరిక l
  • 16 రోజుల్లో 13వ సారి రేట్ల పెంపు
  • పెట్రోల్‌పై 27, డీజిల్‌పై 25 పైసల చొప్పున వడ్డన
  • రాజధాని ఢిల్లీలో రూ.83 దాటిన లీటర్‌ పెట్రోల్‌ ధర 

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 5: దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. గత రెండేండ్లలోనే అత్యధికంగా ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర 83  రూపాయలు దాటింది. శనివా రం పెట్రోల్‌ ధర 27 పైసలు, డీజిల్‌పై 25 పైసలు చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.82.86 నుంచి రూ.83.13కి చేరింది. అలాగే డీజిల్‌ ధర 73.07 నుంచి 73.32కి పెరిగింది. 2018  సెప్టెంబర్‌ తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. నవంబర్‌ 20 తర్వాత ఇం ధన ధరలు పెరుగడం ఇది 13వ సారి. గత 16 రోజుల్లో పెట్రోల్‌ ధర రూ.2.07, డీజిల్‌ ధర రూ.2.86 పెరిగింది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రోజువారీగా ధరలను సవరిస్తున్నాయి.logo