శనివారం 15 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 08:04:05

కోర్టు ధిక్కార చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

కోర్టు ధిక్కార చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కార చట్టం రాజ్యాంగ ప్రామాణికతను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది. ఈ పిటిషన్‌ను కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరీ, ది హిందూ మాజీ ఎడిటర్‌ ఎన్‌ రామ్‌, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలు చేశారు. కోర్టు ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్‌ 2(1)(సీ)లోని కొన్ని నిబంధనలు పౌరుల మాట్లాడే స్వేచ్ఛ, సమానత్వపు హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo