ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 13:01:21

త‌ల‌మీద చేయి పెట్ట‌గానే ప‌క్షి ఏం చేసిందో చూడండి : వీడియో వైర‌ల్‌

త‌ల‌మీద చేయి పెట్ట‌గానే ప‌క్షి ఏం చేసిందో చూడండి :  వీడియో వైర‌ల్‌

ప‌క్షు‌లు, జంతువులు ఇలా.. పెట్స్ వేటి త‌ల‌మీద అయినా చేయి పెడితే చాలు. అవి ఎంతో ఆప్యాయంగా ద‌గ్గ‌ర తీసుకున్న‌ట్లుగా చేతిలోకి వ‌చ్చి ఒదిగిపోతాయి. వ‌న్య‌ప్రాణులు, మూగ‌జీవాల‌ వీడియోల‌తో సోష‌ల్ మీడియా నిండిపోయింది. ఇప్పుడు అలాంటి వీడియో మ‌రొక‌టి వైర‌ల్ అయింది. 27 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను బ్యాక్ టు నేచ‌ర్ ట్విట‌ర్లో షేర్ చేసింది.

ఓ వ్య‌క్తి త‌న చేతిని ప‌క్షి త‌ల మీద పెట్టాడు. దాంతో ఆ ప‌క్షిలోని క‌ద‌లిక‌లు నెటిజన్ల‌ను అబ్బుర‌ప‌రిచింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేప‌టికే వైర‌ల్ అయింది. వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 162.8 కే మంది వీక్షించారు. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను క‌ట్టిప‌డేసింది. ఇంట్లో పెట్ ఉంటే మీరు కూడా ఒక‌సారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. 


logo