బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 15:09:46

ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్‌ పరార్‌..

ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్‌ పరార్‌..

బెంగళూరు : కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న ఓ రోగి ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఆదివారం ఉదయం దుబాయి నుంచి మంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అతను తీవ్ర జ్వరంతో బాధపడుతూ.. కరోనా వైరస్‌ లక్షణాలను కలిగి ఉన్నాడు. దీంతో అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ సదరు రోగి వైద్యులకు సహకరించకుండా.. ఆస్పత్రి నుంచి పారిపోయాడు. తాను ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటానని అతను చెప్పినట్లు ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి ఆస్పత్రి సిబ్బంది సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ ఘటనపై దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్‌ సింధూ బీ రూపేష్‌ స్పందించారు. దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి తీవ్ర జ్వరం ఉంది. గత రాత్రి జిల్లా ఆస్పత్రికి అతడిని తరలించాం. కానీ వైద్యులకు అతను సహకరించడం లేదు. పారిపోయిన అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో చేర్పించేందుకు ఒప్పించామని ఆమె తెలిపారు. 


logo