మంగళవారం 26 మే 2020
National - May 16, 2020 , 16:02:07

ఇదీ క్రియేటివిటీ పెండ్లి పత్రిక అంటే..

ఇదీ క్రియేటివిటీ పెండ్లి పత్రిక అంటే..

ముంబై: ఓ నేవీ పైలట్‌ తన పెండ్లి ఆహ్వాన పత్రికను తన ఊహాశక్తినంతా ఉపయోగించి తయారుచేసి సీనియర్ల నుంచి శహబాష్‌ అనిపించుకొన్నాడు. పర్మిషన్‌ టు బైట్‌ ది బుల్లెట్‌ అనే వాక్యంతో లేఖ ప్రారంభం అవుతుంది. ఇష్టపూర్వకంగా  త్యాగం చేసుకొంటున్నాను, సంపూర్ణ శాంతి కాలం.. వంటి పదాలు మనకు ఈ లేఖలో కనిపిస్తాయి. ఒకరినొకరు చంపుకోకుండా.. జీవితాంతం కలిసి ఉండగలుగుతామని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాపించిన సమయంలో మీరు మీ ఇంటి  నుంచే మాకు ఆశీర్వచనాలు అందజేస్తారని ఆశిస్తున్నాం అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ కాస్తా బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

'తక్కువ సమయంలో ఇంత పెద్ద బాంబు మీ నెత్తిన వేస్తానని నేను ఊహించలేదు.. అయితే, మీరు అంగీకరించినట్లుగా నాకు నేనుగా నాపై ఒక అణ్యాయుధాన్ని వేసుకోవాలని అనుకొంటున్నాను. సెకండ్ల వ్యవధిలో మనం తీసుకొనే నిర్ణయాల మాదిరిగానే నేను కూడా నిర్ణయం తీసుకొన్నాను. నా నిర్ణయాన్ని తిరిగి అంచనా వేసేందుకు నా విలాసవంతమైన సమయాన్ని అనుమతించలేను..' అని తాము నిత్యం ఉద్యోగ బాధ్యతల్లో పేర్కొనే అంశాలతో లేఖ రాయడం అందరినీ ఆకట్టుకొన్నది. వర్చువల్‌ ఇంటరాక్టీవ్‌ ప్లాట్‌ఫాం ద్వారా తన బాస్‌ను కూడా తన పెండ్లికి ఆహ్వానించడం కొసమెరుపు.logo