గురువారం 26 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 11:53:34

యూట్యూబ్ చానెల్స్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అనుమతి తప్పనిసరి...

యూట్యూబ్ చానెల్స్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కు అనుమతి తప్పనిసరి...

ఢిల్లీ :ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న యూట్యూబ్ చానెల్స్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నది. ఇప్ప‌టి వ‌ర‌కు యూట్యూబ్ చానెల్స్ లో ఎలాంటి కంటెంట్ వాడాలి, ఓటీటీలపై సెన్సార్ వంటి అంశాలపై నియంత్రణ లేదు. ఎవ‌రికి నచ్చిన‌ట్లు వారు వీడియోలు పెడుతున్నారు. అయితే  దీనిపై కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇటీవల ఓటీటీ ప్లేట్ ఫామ్స్ , యూట్యూబ్ చానల్స్ లో ఉన్నకంటెంట్ అసభ్యకరంగా ఉండడంతో వ‌రుస‌గా ఫిర్యాదులు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నది. యూట్యూబ్, ఓటీటీలు కొత్త‌గా చానెల్స్ ఓపెన్ చేయాలంటే ప్ర‌భుత్వ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి చేసింది.అంతేకాదు ఆయా చానెళ్ళలో ప్ర‌చారం అయ్యే అన్ని వీడియోల‌ను స‌మాచార శాఖ కింద‌కు తెస్తూ నిర్ణ‌యం తీసుకున్నది. ఇక నుంచి ఆన్ లైన్ చానెల్స్ , ఓటీటీ ప్లేట్ ఫామ్స్  పై కేంద్రం నిఘా పెట్టనున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.