సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 11:12:18

యువ‌కుడిపై ఎస్ఐ జులుం.. స‌స్పెండ్ చేసిన డీజీపీ

యువ‌కుడిపై ఎస్ఐ జులుం.. స‌స్పెండ్ చేసిన డీజీపీ

ప‌శ్చిమ‌గోదావ‌రి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ ఎస్సై అతిగా ప్ర‌వ‌ర్తించాడు. ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌న్న కార‌ణంతో ఓ యువ‌కుడిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. త‌ప్ప‌యింద‌ని బ‌తిమాల‌డానికి వ‌చ్చిన అత‌ని తండ్రిని కూడా తీవ్రంగా కొట్టాడు. ఈ దాడి దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. త‌ర్వాత‌ డీజీపీ గౌతం స‌వాంగ్ దృష్టికి ఆ వీడియోలు వె|ళ్ల‌డంతో.. ఎస్ఐపై సస్పెన్ష‌న్ వేటుప‌డింది. 

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెర‌వ‌లిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. విష‌యం తెలిసిన వెంట‌నే డీజీపీ గౌతం స‌వాంగ్ పెర‌వ‌లి ఎస్ఐ కిర‌ణ్‌కుమార్‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. లాక్ డౌన్ సంద‌ర్భంగా ఎవ‌రైనా ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే ముందుగా హెచ్చ‌రించాల‌ని, అయినా మాట విన‌క‌పోతే అప్పుడు లాఠీచార్జి చేయాల‌ని డీజీపీ సూచించారు. అత్య‌వ‌స‌రాల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చేవారిని ఇబ్బంది పెట్టొద్ద‌ని చెప్పారు. బ‌య‌ట ఎవ‌రు క‌న‌ప‌డ్డా అకార‌ణంగా లాఠీల‌కు ప‌నిచెప్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని పోలీసులకు హెచ్చ‌రిక చేశారు.  


logo