మంగళవారం 26 మే 2020
National - May 13, 2020 , 08:56:33

రెండు నెల‌లుగా ప‌నిలేదు.. బ‌తుకు భార‌మైంది!‌

రెండు నెల‌లుగా ప‌నిలేదు.. బ‌తుకు భార‌మైంది!‌

పుణె: క‌రోనా మ‌హమ్మారి నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డం కోసం ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దాదాపు రెండు నెల‌లుగా ‌లాక్‌డౌన్ కొన‌సాగుతున్నా క‌రోనా ర‌క్క‌సి ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో .. మ‌రికొన్ని రోజులు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో ఇప్ప‌టికే ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇదే క్ర‌మంలో మ‌హారాష్ట్ర‌లోని పుణె న‌గ‌రంలో ఇండ్ల‌లో పాచి ప‌నులు చేసుకుని బ‌తికే మ‌హిళ‌లు త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు. 

రెక్కాడితేగాని డొక్కాడ‌ని తాము చేయ‌డానికి ప‌ని లేకుండా ఎలా బ‌తుకాలంటూ ఆవేద‌న చెందుతున్నారు. రెండు నెల‌లుగా ప‌నిలేదని, లాక్‌డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియ‌ద‌ని, లాక్‌డౌన్ ఎత్తివేసినా తిరిగి త‌మ‌కు ప‌ని దొరుకుతుందో లేదోన‌ని వారు ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ‌కు చిన్న‌చిన్న పిల్ల‌లు ఉన్నార‌ని, ప‌నులు లేక వారికి క‌డుపు నిండా తిండి కూడా పెట్ట‌లేకపోతున్నామ‌ని ఆ మ‌హిళ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo