గురువారం 09 జూలై 2020
National - Jun 20, 2020 , 13:22:48

క్వారంటైన్‌ భయంతో కరోనా పరీక్షలు చేయించుకోవట్లే..

క్వారంటైన్‌ భయంతో కరోనా పరీక్షలు చేయించుకోవట్లే..

న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఐదు రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేయడంతో ప్రజలు భయంతో కరోనా పరీక్షలకు చేయించుకోవడం లేదని ఢిల్లీ అధికార పార్టీ ఎమ్మెల్యే రాఘవ్‌ చద్ధా విమర్శించారు. కరోనా లక్షణాలు ఉన్నా, లేకున్నా కరోనా బాధితులు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు క్వారంటైన్‌ సెంటర్లలో ఉండాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. దీంతో క్వారంటైన్‌ సెంటర్లకు బయపడి ప్రజలు సోంతంగా పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడంలేదని చెప్పారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో బాధితులకు చికిత్స అందించడానికి జూన్‌ 30 నాటికి అదనంగా 15వేల మంచాలు అవసరమవుతాయని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ నెల చివరి నాటికి 90 వేల మంచాలను సిద్ధంచేయాలని, అంత పెద్దమొత్తంలో మంచాలను ఎక్కడి నుంచి తెస్తామని ఆయన ప్రశ్నించారు. దేశ రాజధానిలో ఇప్పటివరకు 53,116 కరోనా కేసులు నమోదవగా, 2035 మంది బాధితులు మరణించారు. 


logo