శనివారం 04 జూలై 2020
National - Jun 26, 2020 , 18:19:37

మధ్యస్థ వర్ణఅంధత్వం ఉన్నా .. ఇక డ్రైవింగ్‌ లైసెన్స్‌

మధ్యస్థ వర్ణఅంధత్వం ఉన్నా .. ఇక డ్రైవింగ్‌ లైసెన్స్‌

న్యూఢిల్లీ : స్వల్ప, మధ్యస్థ వర్ణ అంధత్వం ఉన్న వారు సైతం  డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దివ్యాంగులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేసేందుకు రవాణా మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుందని తెలిపింది. రవాణా సంబంధ సేవల్లో వీరిని వినియోగించుకోవాలంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి అని పేర్కొంది. ఫిజికల్‌ ఫిట్‌సెన్‌ అందజేయాల్సి రావడంతో వర్ణఅంధత్వం ఉన్న వారు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు అర్హులుకాదని మంత్రిత్వశాఖకు పలువురు సూచించారు. ఇదే విషయాన్ని నిష్ణాతులైన ప్రఖ్యాత వైద్య సంస్థలకు పరిశీలనార్థం పంపగా స్వల్ప అంధత్వం ఉన్నా డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేయవచ్చని చెప్పారని వెల్లడించింది. ఇకపై పూర్తి వర్ణ అంధత్వం ఉన్న వారికి మాత్రమే లైసెన్స్‌ జారీ చేయకుండా పరిమితి విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మోటారు వాహన చట్టం-1989లోని ఫారం 1, ఫారం 1ఏలో సవరణలకు ప్రతిపాదించింది.


logo