బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 17:14:49

కామదహనం బదులు 'కరోనాసుర' దహనం

కామదహనం బదులు 'కరోనాసుర' దహనం

ముంబయి : కరోనా వైరస్‌ ప్రపంచమంతా వ్యాపించింది. భారత్‌లోనూ అక్కడక్కడ ఈ వైరస్‌ సోకింది. ఈ నేపథ్యంలో ముంబయిలోని వోర్లి వాసులు వినూత్నంగా హోలీ పండుగను వినూత్నంగా నిర్వహించారు. కామదహనం బదులు కరోనాసుర దహనం చేశారు. ఒక దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి.. దానికి కోవిద్‌-19 అని రాశారు. దిష్టిబొమ్మ కింద కరోనాసుర అని రాసి ఉంచారు. ఇక దిష్టిబొమ్మ మెడ చుట్టూ.. కరోనా వైరస్‌ను పోలిన దండను వేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి దహనం చేశారు. logo
>>>>>>