మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Oct 18, 2020 , 21:37:13

ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ కోసం చెట్ల తొలగింపుపై నిరసన

ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ కోసం చెట్ల తొలగింపుపై నిరసన

డెహ్రాడూన్‌: ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ కోసం అరుదైన చెట్లను తొలగించడంపై పర్యావరణ ప్రేమికులు నిరసన తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ విమానాశ్రయం విస్తరణ కోసం ఆ ప్రాంత పరిధిలోని సుమారు పది వేల చెట్లను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. కాగా పర్యావరణ పరిరక్షణ ప్రేమికులు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఆదివారం విమానాశ్రయం సమీపంలోని  చెట్ల వద్ద నిరసన తెలిపారు. థానో అడవి ఒక విలువైన వనరు అని, ఇక్కడి ప్రతి చెట్టు ఎంతో ముఖ్యమని నిరసనకారులు తెలిపారు. అరుదైన ఈ చెట్లను కాపాడుకుంటామని, ప్రభుత్వ విధ్వంసక విధానాలకు వ్యతిరేకంగా తాము పోరాడుతామని వారు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo