గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 11:33:59

మ‌హీంద్రా మెచ్చిన ఇంటి ఆట‌

మ‌హీంద్రా మెచ్చిన ఇంటి ఆట‌

సాధార‌ణంగా రోజూ ఆఫీస్‌కు వెళ్లి రావాలంటే చాలా క‌ష్టంగా అనిపిస్తుంది. వీకెండ్ ఎప్ప‌డు వ‌స్తుందా! అని ఎదురుచూస్తుంటాం. అలాంటిది ఇప్పుడు ఏకంగా క‌రోనా హాలిడేస్ ఏప్రిల్ 14 వ‌ర‌కు ఇచ్చారు. ఇప్పుడేమో ఆఫీస్ ఉంటే బాగుంటుంది. ఇంట్లో ఉంటే పిచ్చిప‌ట్టేలా ఉంద‌ని టిక్‌టాక్ వీడియోల ద్వ‌రా సందేశాలు పంపుతున్నారు. కొంత‌మంది ఈ సెల‌వుల‌ను ఎలా హాయిగా గ‌డుపుదామ‌ని ఆలోచిస్తున్నారు. మ‌రికొంత‌మంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇప్ప‌డు ఆనంద్‌ మ‌హీంద్రాను ఎంతో ఆనందానికి గురి చేసింది. ఢిల్లీలో లాక్‌డౌన్ కార‌ణంగా అంద‌రూ ఇంట్లోనే ఉంటున్నారు. 

వెస్ట్ ఢిల్లీలోని రెసిడెన్సి కాల‌నీలోని ప్ర‌జ‌లంతా ఇంట్లోని బాల్క‌నీ వ‌ద్ద‌కు చేరి చేతిలో కాగితాలు ప‌ట్టుకొని తంబూలా (హౌసీ) గేమ్ ఆడుతున్నారు. ఒక అమ్మాయి మైక్ ప‌ట్టుకొని తంబూలా నెంబ‌ర్స్ చెబుతున్న‌ది. ఎదుటి అపార్ట్‌మెంట్స్ వారు ఆ నెంబ‌ర్లు విని ఆట‌ను కొన‌సాగిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త మ‌హీంద్రా కంట ప‌డింది. లాక్‌డౌన్‌కు క‌ట్టుబ‌డి బ‌య‌ట‌కు రాకుండా ఇంట్లోనే ఉంటూ మంచి ప‌నిచేస్తున్నార‌ని ఆనంద్ ఆ వీడియోను త‌న ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. దీనికి 2 వేల‌కు పైగా రీట్వీట్స్ రాగా 16 వేలమంది లైక్ చేశారు. వీరిని ఆద‌ర్శంగా తీసుకొని భార‌త్ ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌ద్దు అని కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.


logo
>>>>>>