గురువారం 02 జూలై 2020
National - Jun 21, 2020 , 14:00:21

యోగా డే: పాక్ జ‌ల‌సంధిలో శ‌వాస‌నాలు.. వీడియో

యోగా డే: పాక్ జ‌ల‌సంధిలో శ‌వాస‌నాలు.. వీడియో

న్యూఢిల్లీ: అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం నేప‌థ్యంలో దేశ‌మంతా ఘ‌నంగా యోగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. యోగా శ్వాస‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుస్తుంద‌ని, నిత్యం యోగా చేయ‌డం ద్వారా ఊపిరితిత్తుల‌పై ప్ర‌భావం చూపే క‌రోనా లాంటి వైర‌స్‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని యోగా డే సంద‌ర్భంగా ఇచ్చిన సందేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ స‌హా ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు ఉద‌యాన్నేవారివారి నివాసాల్లో యోగా చేశారు. 

ఇక జ‌మ్ముక‌శ్మీర్‌, ల‌ఢ‌ఖ్‌, ఉత్త‌రాఖండ్ త‌దిత‌ర ప్రాంతాల్లో విధులు నిర్వ‌హిస్తున్న భ‌‌ద్ర‌తాబ‌లగాలు సైతం ఉద‌యం యోగా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాయి. ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్ సిబ్బంది ఎముక‌లు కొరికే చ‌లిలో మంచు కొండ‌ల‌పై యోగ‌స‌నాలు వేశారు. ఇక రామేశ్వ‌రంలోని స‌ముద్ర‌తీరంలోని పాక్ జ‌ల‌సంధిలో ప‌లువురు యోగా కార్యాక్ర‌మాల్లో పాల్గొన్నారు. నీటిలో శ‌వాస‌నాలు వేశారు. ఊపిరి బిగప‌ట్టి ఎలాంటి క‌ద‌లికలు లేకుండా నీటిపై తేలియాడారు.   ‌


logo