సోమవారం 23 నవంబర్ 2020
National - Oct 25, 2020 , 14:36:16

బీహార్ ప్ర‌జ‌లు నితీష్‌ను తిర‌స్క‌రిస్తారు : తేజ‌స్వి యాద‌వ్‌

బీహార్ ప్ర‌జ‌లు నితీష్‌ను తిర‌స్క‌రిస్తారు : తేజ‌స్వి యాద‌వ్‌

పాట్నా : సీఎం నితీష్ కుమార్ పాల‌న‌పై బీహార్ ప్ర‌జ‌లు కోపంతో ఉన్నార‌ని, ఆయ‌న‌ను ఈ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా తిర‌స్క‌రిస్తార‌ని రాష్ర్టీయ జ‌న‌తా ద‌ళ్‌(ఆర్జేడీ) నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. ఆదివారం ఉద‌యం తేజ‌స్వి యాద‌వ్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తేజ‌స్వి యాద‌వ్ మాట్లాడుతూ.. త‌మ వెంట వ‌స్తున్న జ‌న‌సందోహాన్ని చూస్తుంటే.. నితీష్‌పై ఎంత ఆగ్రహాంతో ఉన్నార‌నేది తెలుస్తుంద‌న్నారు. కుల‌, మతాలు ప‌క్క‌న‌పెట్టి నితీష్ ను ఓడించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం బీహార్ నిరుద్యోగ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటుంద‌ని చెప్పారు. ఆర్జేడీ అధికారంలోకి వ‌స్తే త‌ప్ప‌కుండా 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని తేజ‌స్వి యాద‌వ్ స్ప‌ష్టం చేశారు.