గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 12:42:58

ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి రామ‌మందిరం నిర్మిస్తున్నాం: ప‌్ర‌ధాని

ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి రామ‌మందిరం నిర్మిస్తున్నాం: ప‌్ర‌ధాని

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే తొలి విడుత పోలింగ్ జ‌రిగే ప్రాంతాల్లో ప్ర‌చారం నిర్వ‌హించిన ప్ర‌ధాని.. ఈ రోజు రెండో విడుత పోలింగ్ జ‌రుగ‌నున్న ప్రాంతాల్లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముందుగా ద‌ర్భంగాలోని రాజ్ మైదాన్‌లో ఏర్పాటుచేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని ప్ర‌సంగించారు. బీజేపీ గ‌త‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఒక్కో హామీని నెరువేరుస్తూ వ‌స్తున్న‌ద‌ని ప్ర‌ధాని చెప్పారు. అయోధ్య‌లో రామ మందిరం నిర్మిస్తామ‌ని గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చామ‌ని, ఆ హామీ మేర‌కు ఇప్పుడు అక్క‌డ ఒక గొప్ప రామ మందిర నిర్మాణం కొన‌సాగుతున్న‌దని ఆయ‌న తెలిపారు. 

దేశంలోని కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు గ‌తంలో రామ మందిరం ఎప్పుడు నిర్మిస్తారంటూ బీజేపీని నిల‌దీస్తూ ఉండేవార‌ని, రామాల‌య నిర్మాణం ఎప్పుడు మొద‌ల‌వుతుందో తేదీ చెప్పాలంటూ అవ‌హేళ‌న చేసేవార‌ని, తీరా ఇప్పుడు ఎన్‌డీఏ ప్ర‌భుత్వం రామ మందిరం నిర్మిస్తుంటే ప్ర‌శంసించ‌డానికి వారికి నోరు కూడా పెగ‌ల‌డం లేద‌ని ప్ర‌ధాని మోదీ ఎద్దేవా చేశారు. బీహార్‌లో గ‌తంలో  ఆట‌విక పాల‌న సాగించి రాష్ట్రాన్ని దోచుకున్న‌వారిని మ‌రోసారి ఓడించాల‌ని బీహార్ ప్ర‌జ‌లు నిశ్చ‌యించుకున్నార‌ని ప్ర‌ధాని మోదీ ఆర్జేడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వారి పాల‌నాకాలంలో బీహార్‌లో నేరాలు పెచ్చ‌రిల్లాయ‌న్నారు.        

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.