బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 17:39:11

ప‌ది మొక్క‌లు నాటితేనే.. గ‌న్ లైసెన్స్‌

ప‌ది మొక్క‌లు నాటితేనే.. గ‌న్ లైసెన్స్‌

ఛండీగ‌ఢ్: ప‌ంజాబ్‌లోని పాటియాలా జిల్లా యంత్రాంగం ఒక కొత్త విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ప‌ది మొక్క‌లు నాటిన వారికే గ‌న్ లైసెన్స్ ఇస్తామ‌ని తెలిపింది. 'ట్రీస్ ఫర్ గన్స్' విధానం ప్రకారం పాటియాలా ప్ర‌జ‌లు  తుపాకీ లైసెన్స్ పొందడానికి 10 మొక్కలను నాటాల‌ని డివిజ‌న‌ల్ క‌మిష‌న‌ర్ చందర్ గైండ్ చెప్పారు. ప‌త్తి మినహా ఏవైనా చెట్లు నాట‌వ‌చ్చ‌ని తెలిపారు. ఒక నెల పాటు పెంచి, సంరక్షించిన‌ తర్వాత ఆ మొక్క‌ల‌తో క‌లిసి ఫోటో దిగి స‌మ‌ర్పించాల‌ని అన్నారు. ఆ త‌ర్వాతే  తుపాకీ లైసెన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంద‌ని డివిజ‌న‌ల్ క‌మిష‌న‌ర్ చందర్ గైండ్ చెప్పారు. పాటియాలాలో ప‌చ్చ‌ద‌నాన్నిపెంచేందుకు ఈ విధానం ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. logo